‘మేడిగడ్డ’ పునరుద్ధరణ ఆలస్యం! | - | Sakshi
Sakshi News home page

‘మేడిగడ్డ’ పునరుద్ధరణ ఆలస్యం!

Jan 17 2026 9:01 AM | Updated on Jan 17 2026 9:01 AM

‘మేడిగడ్డ’ పునరుద్ధరణ ఆలస్యం!

‘మేడిగడ్డ’ పునరుద్ధరణ ఆలస్యం!

పరీక్షల ఫలితాలకు

ఏడాది దాటే అవకాశం

క్షేత్రస్థాయి పరీక్షలు పూర్తయ్యాకే

ముందడుగు

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ పునరుద్ధరణకు మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశాలు ఉ న్నట్లు తెలుస్తోంది. సాంకేతిక కారణాలు, క్షేత్రస్థా యి పరీక్షల నిర్వహణలో జాప్యం కారణంగా పునరుద్ధరణ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. బ్యారేజీ నిరుపయోగంగా మారి ఇప్పటికే రెండేళ్లు పూర్తవుతున్నా, పునరుద్ధరణ ఎ ప్పుడవుతుందో ఇంకా స్పష్టత రావడం లేదు.

రెండేళ్లుగా..

మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్‌ 21న ఏడోబ్లాక్‌లోని 20వ పియర్‌ కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్లలో సీపేజీ లీకేజీలు ఏర్పడ్డాయి, అప్పటి నుంచి ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాలు, సూచనల మేరకు పలు పరీక్షలు నిర్వహించారు. మళ్లీ పునరుద్ధరణ చేపట్టడానికి పరీక్షలు చేయడానికి ఈనెలలో అడుగులు వేస్తున్నారని తెలిసింది. కాగా మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీ ల్లో నిర్వహించాల్సిన పరీక్షల అనంతరం చేపట్టే పనులకు అవసరమైన డిజైన్ల రూపకల్పన కోసం నీ టిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) డిజైన్‌సంస్థలతో ఒప్పందాలకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు సమాచారం.

9 రకాల పరీక్షలు చేయడానికి సిద్ధం..

మేడిగడ్డ బ్యారేజీలో కుంగుబాటుకు గురైన ఏడో బ్లాక్‌లో ఇప్పటికే ఒక దఫా పరీక్షలు నిర్వహించిన సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) మరో తొమ్మిది రకాల పరీక్షలు చేపట్టనుంది.

ఈనెల చివరి వారం లేదా ఫిబ్రవరిలో..

ఈ నెల చివరి వారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికా రులు భావిస్తున్నారు. నీటి నిల్వ చేయడానికి బ్యారేజీలు వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు కూడా సిద్ధంగా లేవని ఆ రోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఇరిగేషన్‌ ఈఈ తిరుపతిరావును ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్‌ నాట్‌ రీచబుల్‌ అని వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement