వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి బృందం సందర్శించింది. ది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సింగరేణి డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లిలో జరుగుతున్న పెట్రోల్ లీడర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా రామప్ప దేవాలయాన్ని స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ సాయి నిరంజన్ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియాల నుంచి కలిసివచ్చిన పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ సందర్శించారు. అనంతరం వారు రామలింగేశ్వరస్వామిని దర్శించుకోగా టూరిజం గైడ్ విజయ్ కుమార్ వారికి ఆలయ చరిత్రను వివరించారు. కార్యక్రమంలో స్కౌట్స్ లీడర్స్ శ్రీనివాసరావు, స్వామి, మాస్టర్స్ రమేశ్, కుమార్, భాస్కర్, శైలజ తదితరులు పాల్గొన్నారు.


