ఏటూరునాగారం: తక్కువ కోడ్ చేసిన వారినుంచే కుట్టు మిషన్లు కొనుగోలు చేస్తామని ఏపీఓ వసంతరావు తెలిపారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ సమీపంలో ఉన్న గోదాంలో ఉచిత కుట్టు శిక్షణతో పాటు మహిళా గ్రూపుల్లోని గిరిజన మహిళలకు ప్రభుత్వ పాఠశాలల స్కూల్ యూనిఫాంలను కుట్టించడానికి ప్రత్యేకంగా రూపొందించనున్న కుట్టు మిషన్ కేంద్రానికి ఐటీడీఏ అధికారులు గతంలో టెండర్లను ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం కార్యాలయంలో ఆన్‌లైన్‌లో టెండర్లు వేసిన వ్యాపారుల నుంచి మిషనరీ నమూనాలను సేకరించారు. అనంతరం ఏపీఓ మాట్లాడుతూ ఎవరు తక్కువ కోడ్ చేస్తే వారి నుంచే మిషనరీని కొనుగోలు చేస్తామని తెలిపారు. డ్రెస్‌ల తయారీకి కటింగ్ టేబుల్, కాజా మిషన్, బటన్ మిషన్, ప్రిటింగ్ మిషన్, డ్రెస్ కటింగ్ మిషన్‌నరీలను కొనుగోలు చేయాల్సి ఉందని తెలిపారు. సరైన కంపెనీ యజమానుల వద్ద నాణ్యతతో కూడిన మిషనరీని ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఇస్తే వారి నుంచి కొనుగోలు చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేష్‌బాబు, జీసీసీ డీఎం వాణి, జేడీఎం కొండల్‌రావు, డీటీ అనిల్ ఆధ్వర్యంలో టెండర్లను పరిశీలించారు. తక్కువ కోడ్ చేసిన వారి వివరాలను ఉన్నతాధికారులకు అందజేశారు.
ఐటీడీఏ ఏపీఓ వసంతరావు


