న్యూస్‌రీల్
ఈనెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహణ
మేడారంలో
వ్యాపార కమిటీ ఎన్నిక
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో ఆదివాసీ వ్యాపార కమిటీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వ్యాపార కమిటీ అధ్యక్షురాలిగా బంగారి సులోచన, ఉపాధ్యక్షుడిగా అలం సమ్మారావు, కార్యదర్శిగా చింత సతీష్, సహాయ కార్యదర్శిగా సిద్ధబోయిన సత్యవతి, కోశాధికారిగా తల్లడి గౌరమ్మ, కోశాధికారిగా సిద్ధబోయిన సావిత్రి, సలహాల కమిటీ సభ్యులుగా సిద్ధబోయిన జగ్గారావు, పీరిళ్ల వెంకన్న, చిడం బాబురావు, సిద్ధబోయిన స్వామి, నర్సింగరావు, సిద్ధబోయిన రాణా, రమేశ్, కొక్కెర రమేశ్, సిద్ధబోయిన సురేందర్‌లను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా కమిటీ అధ్యక్షురాలు సులోచన మాట్లాడుతూ అమ్మవార్ల గద్దెల పరిసరాల ప్రాంతాలు, రోడ్లకు ఇరువైపులా ఖాళీ స్థలాల్లో ఆదివాసీలు మాత్రమే వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవాలని కమిటీలో తీర్మాణించినట్లు వెల్లడించారు. మేడారంలో ఆదివాసీల వ్యాపారాల అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సర్పంచ్‌లు
ములుగు: ఢిల్లీలో ఈ నెల 13న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట సర్పంచ్ బొమ్మకంటి వంశావతి, ములుగు మండలం రాయినిగూడెంకు చెందిన ఈసం సునీత ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహిళా సాధికారత సమాన హక్కులపై ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగ కార్యక్రమానికి జిల్లా నుంచి ఇద్దరు సర్పంచ్‌లు ఎంపికై ఢిల్లీకి తరలివెళ్లారు.
అంగన్‌వాడీకేంద్రం సందర్శన
ములుగు: ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మంగళవారం జిల్లా కేంద్రంలోని కృష్ణకాలనీ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీడీపీఓ శిరీష వైద్య కళాశాల విద్యార్థులకు అంగన్‌వాడీ తరఫున పిల్లలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందించే ఐదు రకాల సేవల గురించి వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి కిశోర బాలికల పిల్లలతో విద్యార్థులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ములుగు వైద్య కళాశాల నుంచి డాక్టర్ స్వామి, డాక్టర్ వాణి, ఆరోగ్య విద్యా బోధకులు చిదురాల భాస్కర్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు సరస్వతి, రమాదేవి, కళావతి, ఆనంతలక్ష్మి పాల్గొన్నారు.
ములుగు: పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నెల 14 నుంచి ఏఫ్రిల్ 13 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సారి సెంట్రల్ సిలబస్ తరహాలో పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతీ పరీక్షకు మధ్య(సబ్జెక్టువారీగా) మూడు నుంచి నాలుగు రోజుల పాటు వెసలుబాటు కల్పించారు. ఈ క్రమంలో పరీక్షల మధ్య ఉన్న వ్యవధిని వినియోగించుకునేలా సబ్జెక్టు టీచర్లు తగిన మెలకువలు నేర్పించి సన్నద్ధం చేయాలని విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేసింది.
క్లాక్ రూంల ఏర్పాటు
జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రం వద్ద క్లాక్ రూం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షల మెటీరీయల్ తప్పా ఇతర ఎలాంటి వస్తువులు తీసుకొచ్చినా క్లాక్ రూం వద్ద డిపాజిట్ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్లు, డీఓ, సీఎస్‌లు సైతం తమ సెల్‌ఫోన్లను క్లాక్ రూం వద్దనే డిపాజిట్ చేసి విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. పరీక్ష ప్రారంభ సమయం నుంచి ముగిసేవరకు జిరాక్స్ సెంటర్లను మూసివేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. హాల్‌టికెట్లు పాఠశాలకు వచ్చినప్పటికీ విద్యార్థులకు పంపిణీ చేయకపోవడంతో చాలామంది విద్యార్థులు ఇప్పటికే తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు ఫీజుల కోసం హాల్‌టికెట్లు విద్యార్థులకు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఇన్విజిలేటర్ల కేటాయింపులో పైరవీలు
పరీక్షాకేంద్రాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇన్విజిలేటర్ల నియామకానికి సంబంధించి ఆయా మండలాల ఎంఈఓల నుంచి అనుమతి తీసుకొని జిల్లా విద్యాశాఖాధికారులు ఇన్విజిలేటర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాని నిబంధనలకు విరుద్ధంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేసే ఒకరిద్దరూ ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో పాటు తమ పలుకుబడిని ఉపయోగించి ఇన్విజిలేటర్ల నియామకంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఎస్‌జీటీలను కాకుండా కొంతమంది స్కూల్ ఆసిస్టెంట్లను ఇన్విజిలేటర్లుగా నియమించేందుకు రంగం సిద్ధం చేసినప్పటికీ ఇన్విజిలేటర్ల జాబితాను అధికారికంగా ఇంకా విడుదల చేయలేదు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇన్విజిలేటర్ల నియామకాల్లో అక్రమాలు జరగకుండా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే ఇన్విజిలేటర్ల జాబితాను నేడు(బుధవారం) వెల్లడిస్తాం. ఇన్విజిలేటర్ల జాబితా సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా పనిచేసే చోట వారి పాఠశాలకు చెందిన పిల్లలు లేకపోతేనే విధులు కేటాయిస్తాం. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
– సిద్ధార్థరెడ్డి, డీఈఓ
ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా గంట ప్రతాప్‌ను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీడీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు ఆరేళ్లుగా ఖాళీగా ఉంటుంది. ఎట్టకేలకు ఎస్‌డీసీ పోస్టును భర్తీ చేయడంతో ఇన్ని రోజులు పెండింగ్‌లో ఉన్న ఆర్‌ఓఎఫ్‌ఆర్, ఎల్‌టీఆర్, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయని గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఉదయం 9.30 నుంచి
మధ్యాహ్నం 12.30 గంటల వరకు
జిల్లా పరిధిలోని 10 మండలాల్లో గల 117 పాఠశాలల్లో 3,291 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 14 నుంచి జరిగే పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 1,697 మంది బాలురు, 1,594 మంది బాలికలు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం పరీక్ష కేంద్రాల వారీగా సీఎస్, డీఓ, ఇన్విజిలేటర్ల జాబితాను అధికారులు తయారు చేసినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. మంగపేట మండలంలోని రాజుపేట, మల్లంపల్లి మండలాల్లో పోలీస్ స్టేషన్లు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో సీ సెంటర్లుగా వాటిని గుర్తించి ఆయా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక కస్టోడియమ్‌లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష సమయానికి కంటే అరగంట ముందు ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్‌స్టేషన్ల నుంచి పోలీసుల బందోబస్తు మధ్య సీఎస్, డీఓలు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేయనున్నారు.
పీఎం సూర్యఘర్‌తో ఉచిత విద్యుత్
300 యూనిట్ల వరకు వినియోగం
ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలో 27.07 మెగావాట్ల విద్యుత్‌కు 9,058 దరఖాస్తులు
ఇప్పటి వరకు 2,939 రూఫ్‌టాప్
ఇన్‌స్టలేషన్
ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద
క్లాక్ రూమ్ ఏర్పాటు
కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు..
3,291 మంది విద్యార్థులు


