సమస్యలు తక్షణమే | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తక్షణమే

Mar 10 2026 1:23 PM | Updated on Mar 10 2026 1:23 PM

సమస్యలు తక్షణమే – 8లోu

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 10 శ్రీ మార్చి శ్రీ 2026

ములుగు రూరల్‌: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ టీఎస్‌ దివాకర అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దివాకర అర్జిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ పెండింగ్‌ దరఖాస్తులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా అందిన దరఖాస్తులను పరిశీలించి సాధ్యాసాధ్యాలను అర్జిదారులకు సమాచారం అందించాలని సూచించారు. గ్రీవెన్స్‌లో స్వీకరించిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు.

మొత్తం 49 దరఖాస్తులు

ప్రజావాణిలో మొత్తం 49 దరఖాస్తులు రాగా అత్యధికంగా భూ సమస్యలు 17, పింఛన్లు 15, ఇందిరమ్మ ఇల్లు 3, ఉద్యోగ కల్పన 2, ఇతర దరఖాస్తులు 12 వచ్చాయి.

ప్రజావాణిలో దరఖాస్తును పరిశీలిస్తున్న కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, పక్కన జిల్లా అధికారులు

కలెక్టర్‌ టీఎస్‌ దివాకర

ప్రజావాణిలో 49 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement