మహిళా హక్కుల కోసం పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా హక్కుల కోసం పోరాడాలి

Mar 10 2026 1:23 PM | Updated on Mar 10 2026 1:23 PM

ఏటూరునాగారం: మహిళా హక్కుల కోసం ప్రతీఒక్కరు పోరాడాలని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగా కల్యాణి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కార్యదర్శి చిలుక రాజు అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణి మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ శ్యామ్‌సుందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర గొప్పదన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించారు. జీసీడీఓ రజిత, ఎంఈఓ వాసం సాంబశివరావు, టీపీటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు దిలీప్‌, జిల్లా అధ్యక్షుడు పాల ఉప్పస్వామి, ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.

మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగా కల్యాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement