వరే.. సరి..! | - | Sakshi
Sakshi News home page

వరే.. సరి..!

Mar 10 2026 1:23 PM | Updated on Mar 10 2026 1:23 PM

యాసంగిలో మళ్లీ వరిసాగు వైపు ఉమ్మడి జిల్లా రైతుల మొగ్గు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ :

యాసంగిలోనూ రైతులు వరి సాగువైపే మొగ్గు చూపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ఈ సీజన్‌లో వరిసాగు గతంతో పోలిస్తే కొంత మేర పెరిగినట్లు వ్యవసాయ శాఖ అంచనాలు సూచిస్తున్నాయి. సాగునీటి లభ్యత, మార్కెట్‌ డిమాండ్‌ కారణంగా రైతులు మళ్లీ వరి వైపు మొగ్గు చూపినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో మొత్తం సుమారు 6.35 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు ప్రాథమిక అంచనా. గత యాసంగిలో ఇది 5.98 లక్షల ఎకరాల వరకు మాత్రమే నమోదైంది. దీంతో ఈసారి దాదాపు 37 వేల ఎకరాలకు పైగా పెరుగుదల కనిపించింది.

యాసంగి సాగు ఇలా...

గతంతో పోలిస్తే ఈ యాసంగిలో వరిసాగు పదిశాతం మేర తగ్గుతుందని వ్యవసాయశాఖ అధికారులు మొదట అంచనా వేశారు. ఈ మేరకు ఈ సీజన్‌లో మొత్తం సాగు విస్తీర్ణం 9,12,880 ఎకరాలని అంచనా వేసిన అధికారులు 5.75 లక్షల ఎకరాల్లో వరి పంటలకు అవకాశం ఉందన్నారు. అందుకు భిన్నంగా మొత్తం పంటలు 9,82,880 ఎకరాల్లో వేయగా, 6,34,579 (64.56 శాతం) ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మొక్కజొన్న, ఇతర పంటలన్నీ కలిపితే 35.44 శాతంగా నమోదయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే 37 వేల పైచిలుకు ఎకరాల్లో ఈసారి వరి సాగుకాగా, ఈసారి కూడా వరిసాగులో ఉమ్మడి వరంగల్‌ది రికార్డేనని వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఒకరు పేర్కొన్నారు.

వరి సాగు పెరగడానికి కారణాలు...

జిల్లాల వారీగా చూస్తే హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లో వరి సాగు గణనీయంగా పెరిగింది. మహబూబాబాద్‌, ములుగు, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాల్లో కూడా కొంత మేర విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సాగునీటి లభ్యత, సాగు సౌకర్యాలు మెరుగుపడటం, ప్రభుత్వం వరి కొనుగోలుపై హామీ ఇవ్వడం, సన్నరకం మీద బోనస్‌ ఇవ్వడం వంటి కారణాలతో రైతులు ఇతర పంటల కంటే వరి సాగును ఎక్కువగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని మండలాల్లో నీటి కొరత, వాతావరణ మార్పులు వంటి కారణాలతో వరి సాగు విస్తీర్ణం కొంత తగ్గిన ప్రాంతాలు కూడా ఉన్నాయని వ్యవసాయ అధికారులు తెలిపారు.

జిల్లా మొత్తం పంటలు వరి

వరంగల్‌ 1,96,722 95,152

హనుమకొండ 1,77,735 1,11,380

జనగామ 2,07,353 1,79,010

మహబూబాబాద్‌ 2,13,665 1,07,617

జేఎస్‌ భూపాలపల్లి 1,17,085 89,000

ములుగు 70,320 52,420

మొత్తం 9,82,880 6,34,579

మొత్తం విస్తీర్ణంలో

64.56 శాతం వరి నమోదు

గతంతో పోలిస్తే పెరిగిన వైనం..

మిగతా పంటలతో పోలిస్తే

మేలంటున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement