కొండచిలువ కలకలం | - | Sakshi
Sakshi News home page

కొండచిలువ కలకలం

Mar 10 2026 1:23 PM | Updated on Mar 10 2026 1:23 PM

గోవిందరావుపేట: మండలంలోని దుంపెల్లిగూడెం గ్రామ సమీపంలో శ్మశానవాటిక పక్కన ఉన్న పొలంలో కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఎర్రబోయిన కుమార్‌ తన పొలంలో పాము కనిపంచడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ అడవి జంతువులు గ్రామాల్లో కనిపించినప్పుడు ప్రజలు భయపడకుండా అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement