గణితంపై మక్కువ పెంచుకోవాలి
● డీఈఓ సిద్దార్థరెడ్డి
ములుగు: ఆధునిక శాస్త్ర–సాంకేతిక, కృత్రిమ మేథా యుగంలో గణితశాస్త్రమే ముఖ్యభూమిక పోషిస్తుందని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే గణితంపై మక్కువ పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అ ధికారి సిద్ధార్థ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో తెలంగాణ గణిత ఫోరం ప్రధాన కార్యదర్శి చందా భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి గణిత ప్రతిభా పాటవ పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని 10 మండలాల నుంచి మండలస్థాయిలో విజేతలుగా నిలిచిన 35 మంది విద్యార్థులు పాల్గొనగా, ప్రశ్నపత్రాలను సెక్టోరియల్ అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీల కు ఎంపికై న చరణ్యలక్ష్మి, శివకుమార్, రాజేష్, తహరిన్, కావ్యశ్రీ, సిరిగ్రేస్‌లకు ప్రశంసపత్రాలను అందించారు. అనంతరం డీఈఓ మాట్లాడారు. భవిష్యత్‌లో ఏ రంగంలో అయినా ఎదగాలంటే ప్రాథమిక గణిత భావనలదే పునాది అని, గణితాన్ని కేవలం పాఠ్యాంశంగా కాకుండా నిజ జీవిత సమస్యల పరి ష్కారానికి ఉపయోగించే విధంగా నేర్చుకోవాలన్నా రు. జిల్లాలో గణిత విద్య వ్యాప్తికి కృషి చేస్తున్న గణి త ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహా దారుడు కందాల రామయ్య, రాష్ట్ర పరిశీలకుడు అడిక సతీష్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు హర్షం రాజు, శ్యాంసుందర్ రెడ్డి, గుల్లపల్లి సాంబయ్య, సైకం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


