మేడారం తొలి ఎస్సైగా కమలాకర్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం పోలీస్‌స్టేషన్‌కు తొలి ఎస్సైగా అచ్చ కమలాకర్‌ను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌లు జిల్లాలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద జాతరగా పేరొందిన మేడారం జాతరలో భక్తుల భద్రతకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించారు. పస్రా పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న కమలాకర్‌ను మేడారం ఎస్సైగా నియమించారు. అలాగే తాడ్వాయి ఎస్సైగా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డిని ములుగు డీఎస్‌బీకి బదిలీ చేశారు. ములుగు డీసీఆర్‌బీలో పని చేస్తున్న జగదీశ్‌ను తాడ్వాయి ఎస్సైగా నియమించారు. మేడారం ఎస్సై కమలాకర్, తాడ్వాయి ఎస్సైగా జగదీశ్‌లు బాధ్యతలను స్వీకరించారు.
ఏటూరునాగారం: ట్రైబర్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 5, 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్ హరీష్‌సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2026–27 విద్యాసంవత్సరానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జనవరి 21వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్ని జిల్లాల్లో ఎంపిక చేయబడిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
మంగపేట: మండంలోని మంగపేట, రాజుపేట కమలాపురంలోని పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి సురేష్ ఏటూరునాగారం సహాయ సంచాలకులు అవినాష్‌వర్మతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని రైతువేదికలో రైతు నేస్తం ప్రోగ్రాంలో పాల్గొన్న ఆయన అనంతరం నెలవారి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ చేరాలు, ఏఈఓలు పాల్గొన్నారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో చిలకలగుట్ట దారిలో సీసీ రోడ్డుపై కింద నుంచి ఇనుప చువ్వలు పైకి తేలడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో చువ్వలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో సమ్మక్క పూజారి సిద్దబోయిన అనిల్‌కుమార్ స్పందించి మంగళవారం సొంత ఖర్చులతో ఇనుప సువ్వలను కట్ చేయించారు. మేడారం గిరిజన అభ్యుదయ సంఘం అధ్యక్షుడు బోజరావు, ఆలం సమ్మారావు, అనిల్, శంకర్‌తోపాటు భక్తులు ఆయనను అభినందించారు.
కాటారం: క్రీడలు శారీరక ధృడత్వానికి, మానసిక ప్రశాంతతకు దోహదపడుతాయని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల అన్నారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాటారం మండలకేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద మంగళవారం క్రాస్ కంట్రీ మీట్ నిర్వహించారు. సుమారు 200 మంది బాల బాలికలు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయిలో జనవరి 2న హైదరాబాద్‌లో జరిగే పోటీలకు ఎంపికై నట్లు జిల్లా ప్రెసిడెంట్ పంతకాని సమ్మయ్య, కార్యదర్శి పూతల సమ్మయ్య తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 16, 18, 20 సీనియర్స్ విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలను డీఎస్పీ సూర్యనారాయణ, ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల అభినందించారు. ఈ కార్యక్రమంలో కడారి విక్రమ్, చీమల సందీప్, కరుణాకర్‌రావు, ఉపాధ్యక్షుడు అజయ్, ట్రెజరరీ సాంబమూర్తి, జాయింట్ సెక్రటరీ సారంగపాణి, పీఈటీలు పాల్గొన్నారు.
మేడారం తొలి ఎస్సైగా కమలాకర్
మేడారం తొలి ఎస్సైగా కమలాకర్


