రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి
వరంగల్ చౌరస్తా : వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. ముక్కోటి (వైకుంఠ ) ఏకాదశి సందర్భంగా మంగళవారం వరంగల్ బట్టల బజార్‌లోని ఆలయంలో వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ దైవారాధనతో మానసిక ప్రశాంత కలుగుతుందన్నారు. స్థానిక కార్పొరేటర్ గందె కల్పన, నవీన్ కుమార్ ప్రత్యేక కార్యక్రమాల్లో పొల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. కిలోమీటర్ వరకు భక్తులు క్యూలో బారులుదీరి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. కాగా, దేవాలయం ప్రధాన రహదారిలో ఉండడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ


