కల్వర్టు నిర్మించాలి
మల్హర్: మండలంలోని కొండపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కుంభంపల్లి గ్రామం నుంచి మానేరు సమీపంలో పొలాలకు, శ్మశానవాటికకు వెళ్లడానికి గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దారిలో ఒర్రె మాటు నిత్యం నీళ్లు ఉండటంతో రైతులు అటుగా పోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతిమయాత్ర కార్యక్రమాలకు, పొలం పనులకు వెళ్లడానికి వర్షాకాలం సీజన్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. కుంభంపల్లి మాటుపై కల్వర్టు నిర్మించి, రోడ్డు నిర్మించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


