రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
● వీసీలో రవాణా, బీసీ సంక్షేమశాఖ
మంత్రి ప్రభాకర్
ములుగు రూరల్: రోడ్డు భద్రతా నియమాలు అందరూ పాటించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు, ఆర్‌అండ్‌బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, లాఅండ్‌ఆర్డర్ ఏడీజీ మహేశ్ ఎం.భగవత్‌లు జాతీయ రహదారులు, ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, అదనపు కలెక్టర్ సంపత్‌రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లాలో రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అదే విధంగా విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్, ఇతర పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, డీఈఓ సిద్దార్థరెడ్డి, నేషనల్ హైవే డీఈ కుమారస్వామి, పీఆర్ ఈఈ అజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.


