చదువుతోనే ఉన్నతస్థాయి
● బాలల పరిరక్షణ అధికారులు
కృష్ణవేణి, హరికృష్ణ
వాజేడు: ఆడపిల్లలు ప్రణాళికతో చదువుకుంటేనే ఉన్నతస్థాయికి చేరుకుంటారని జిల్లా బాలల పరిరక్షణ అధికారులు కృష్ణవేణి, హరికృష్ణ అన్నారు. మండల పరిధిలోని పెద్ద గొళ్లగూడెం బాలికల అశ్రమ పాఠశాలలో శనివారం బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని సోషల్ వర్కర్ సుమన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుకోవడం మూలంగా కుటుంబం, సమాజం బాగు పడుతుందని తెలిపారు. చట్టాలు, హక్కులు మొదలైన అన్ని అంశాలపై అవగాహన ఉంటుందని వివరించారు. బాల్య వివాహాల మూలంగా కలిగే నష్టాలను వివరించారు. అనంతరం హైదరాబాద్‌కు చెందిన దాతల సహకారంతో శానిటరీ నాప్కిన్లు, ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన దాతల సహకారంతో నాప్కిన్లు, ప్లే కిట్లు అందించారు.


