ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు
ములుగు రూరల్: ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీకి జిల్లా నుంచి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్‌జీలు హాజరయ్యారు. వరదలు, పరిశ్రమ ప్రమాదాల నియంత్రణపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వరదలు, ప్రమాదాలను ఎదుర్కోవాల్సిన తీరుపై ముందస్తుగా మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ఎస్‌ఓపీ తయారు చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జాతీయ విపత్తుల అథారిటీ సూచనలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆధికారులు సకాలంలో స్పందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు, వ్యవసాయ, పశు సంవర్ధక, అగ్నిమాపక, విద్యుత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
రామకృష్ణారావు


