టీబీ నియంత్రణకు పాటుపడాలి
● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ములుగు రూరల్: టీబీ నియంత్రణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన మొబైల్ ఎక్స్‌రే యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. టీబీ వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. మొబైల్ ఎక్స్‌రే యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ యంత్రం ద్వారా రోజుకు 60 మందికి పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేయవచ్చన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తులను నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్య సిబ్బంది వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి చంద్రకాంత్, డెమో సంపత్, రమేష్, చంద్రమౌళి, రాజు, తదితరులు పాల్గొన్నారు.


