సహకార సంఘాల నిర్వహణ భారం
న్యూస్‌రీల్
2023–24 ఖరీఫ్, రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలు, రావాల్సిన కమీషన్ వివరాలు..
రెండు సీజన్ల
కమీషన్ పెండింగ్
ప్రభుత్వం నుంచి కమీషన్ డబ్బులు రావాల్సి ఉంది..
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ములుగు రూరల్: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ, జీసీసీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం కమీషన్ అందించాల్సి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం రెండు సీజన్ల కమీషన్ డబ్బులను నిర్వాహకుల ఖాతాలలో జమ చేయలేదు. దీంతో ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు, గిరిజన సహకార సంఘాల నిర్వహణ భారంగా మారుతుంది. మహిళా సంఘాలు, రైతు సంఘాల నిర్వాహకులు కమీషన్ల కోసం ఎదురుచూడక తప్పడం లేదు.
సహకార సంఘాల నిర్వహణ భారం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, గిరి జన సహకార సంఘాలు, ఐకేపీ, రైతు సంఘాలు ధాన్యం కొనుగోలు చేయగా వచ్చిన కమీషన్ డబ్బులను సంఘాల అభివృద్ధికి వినియోగిస్తారు. గత రెండు సీజన్ల నుంచి కమీషన్ డబ్బులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నిర్వహణ భారంగా మారుతుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వా రా ధాన్యం సేకరించి మిల్లులకు తరలించిన అనంతరం రైతులకు డబ్బులను చెల్లిస్తుంది. నిర్వహకులకు క్వింటాకు రూ.32 చొప్పున టన్నుకు రూ.320 అందిస్తుంది. నిర్వాహకులు సేకరించిన ధాన్యం లెక్కల ప్రకారం కమీషన్ అందించాల్సి ఉంటుంది.
కొనుగోలు కొనుగోలు చేసిన ధాన్యం కమీషన్ పెండింగ్
కేంద్రాలు (మెట్రిక్ టన్నులు) (రూపాయల్లో)
ఐకేపీ 2,00,097.20 59,65,808.52
పీఏసీఎస్ 7,23,732.40 2,26,37,680.42
జీసీసీ 47,601.20 14,95,068.42
ఎఫ్‌పీఓ 9,711.60 2,78,842.54
ఓడీసీఎంఎస్ 30,737.60 9,61,438.54
మొత్తం 10,11,880.00 3,13,38,838.44
ఐకేపీ 82,386.00 23,48,478.35
పీఏసీఎస్ 3,58,926.00 1,12,46,646.90
జీిసీసీ 16,968.00 4,72,287.90
ఎఫ్‌పీఓ 4,901.20 1,55,554.10
ఓడీసీఎంఎస్ 4,014.40 1,25,668.7
మొత్తం 4,67,195.60 1,43,48,635.95
2023–2024 వర్షాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల ద్వారా 1,01,188 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి రావాల్సిన కమీషన్ రూ. 3,13,38,838.44 పెండింగ్‌లో ఉన్నాయి. యాసంగి సీజన్‌లో 4,67,195.60 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. కమీషన్ రూ.1,43,48,635.95 పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన కమీషన్ 4,56,87,473.91 పెండింగ్‌లో ఉంది.
ఎదురు చూస్తున్న ఐకేపీ సభ్యులు
రెండు సీజన్ల డబ్బులు పెండింగ్
2023–24 ఖరీఫ్, యాసంగి సీజన్‌కు సంబంధించిన కమీషన్ డబ్బలు ప్రభుత్వం నుంచి రాలేదు. ధాన్యం కొనుగోలు పూర్తి అయిన వెంటనే కొనుగోలు కేంద్రాలకు రావాల్సిన కమీషన్ వివరాలను ఉన్నతాధికారులకు అందించాం. కమీషన్ వచ్చిన వెంటనే నిర్వాహకుల ఖాతాలలో జమ చేస్తాం. కొన్ని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సివిల్ సప్లయీస్ నుంచి స్వీకరించిన గన్నీబ్యాగ్స్ తిరిగి అప్పగించని కారణంగా కమిషన్లలో కోతలు విధిస్తున్నాం.
– రాంపతి, జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్
సహకార సంఘాల నిర్వహణ భారం
సహకార సంఘాల నిర్వహణ భారం
సహకార సంఘాల నిర్వహణ భారం


