రామప్పలో సెంట్రల్‌ రైల్వే కమిషనర్‌ | - | Sakshi
Sakshi News home page

రామప్పలో సెంట్రల్‌ రైల్వే కమిషనర్‌

Dec 19 2025 8:06 AM | Updated on Dec 19 2025 8:06 AM

రామప్

రామప్పలో సెంట్రల్‌ రైల్వే కమిషనర్‌

రామప్పలో సెంట్రల్‌ రైల్వే కమిషనర్‌ స్వల్ప ఓట్లతో గట్టెక్కిన సర్పంచ్‌లు ‘పీఆర్టీయూ బలోపేతానికి కృషి’ కార్మిక సంఘాల వైఫల్యంతో సింగరేణికి నష్టం అధికారుల నిర్లక్ష్యం..

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం సెంట్రల్‌ రైల్వే సీనియర్‌ కమిషనర్‌ (ఆర్‌పీఎఫ్‌) సీహెచ్‌ చిత్రేష్‌ జోషి సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్‌ చేశారు. ఆయన వెంట ఎస్సై చల్లా రాజు, టూరిస్ట్‌ పోలీసులు ఉన్నారు.

కన్నాయిగూడెం: మండలంలో బుధవారం జరిగిన స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో ఓట్ల లెక్కుంపు ఉత్కంఠ భరితంగా కొనసాగించింది. ప్రతీ రౌండులో ఇద్దరి మధ్య ఒకటి, రెండు ఓట్ల తేడాలు వస్తుండడంతో ఎవరి గెలుస్తారో తెలియక అభ్యర్థులతో పాటు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో మండల పరిధిలోని గూర్రేవుల సర్పంచ్‌ అంబాల సౌజన్య 3 ఓట్లతో, తుపాకులగూడెం సర్పంచ్‌గా పీరీల స్వప్న 4 ఓట్ల మెజారిటీతో సమీప అభ్యర్థులపై విజయం సాధించారు.

ములుగు: పీఆర్టీయూ బలోపేతానికి సంఘం నాయకులు కృషి చేయాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వేం యాకూబ్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ సందర్బంగా ఎస్‌టీయూ నుంచి సూర్యనారాయణ, మోహన్‌లాల్‌లు పీఆర్‌టీయూలో చేరగా సంఘం సభ్యత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండలాధ్యక్షుడు సానికొమ్ము ముకుందారెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి శివప్రసాద్‌, రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య ఆరోపించారు. ఏరియాలోని యూనియన్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో జరిగిన బొగ్గు బ్లాకుల వేలం పాటలకు వ్యతిరేకంగా జాతీయ కార్మిక సంఘాలు ఎందుకు పోరాటాలు నిర్వహించడం లేదన్నారు. భేషరతుగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రాములు, కుమారస్వామి, రాజన్న, కుమారస్వామి, జనార్దన్‌, జైపాల్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

కాళేశ్వరం: కాళేశ్వరాలయంలో దేవాదాయ, ఎన్పీడీసీఎల్‌ శాఖల నిర్లక్ష్యం భక్తులకు శాపంగా మారనుంది. రామాలయం వెనుకాల భక్తుల సౌకర్యార్ధం నిర్మించిన మరుగుదొడ్ల ఎదుట విద్యుత్‌స్తంభం ప్లోరింగ్‌తో కలిసి, ఎర్త్‌ వైర్‌ బండరాళ్లకు కట్టి ఉంచి నిర్మాణం చేశారు. దీంతో అధికారులు, ఇంజనీర్ల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. ఓ వైపు ఎర్త్‌వైర్‌కు విద్యుత్‌ సరఫరా జరిగితే ప్రమాదం పొంచి ఉంది. అఽధికారుల స్పందించి తొలగించాలని భక్తులు కోరుతున్నారు.

రామప్పలో  సెంట్రల్‌ రైల్వే కమిషనర్‌ 
1
1/1

రామప్పలో సెంట్రల్‌ రైల్వే కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement