ఎరువుల బుకింగ్‌కు మొబైల్ యాప్
ములుగు: రైతులు ఎరువుల బుకింగ్‌కు మొబైల్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టీఎస్.దివాకర తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎరువుల బుకింగ్ యాప్ రైతులకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా పట్టా, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఉన్న రైతులు, కౌలు రైతులు, పట్టా లేని రైతులు కూడా ఈ అప్లికేషన్ ద్వారా ఎరువులను బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ చేసుకునే సమయంలో రైతులు తమ పట్టా పాస్‌బుక్ నంబర్, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా నంబర్, పట్టా లేని రైతులు సాగు చేస్తున్న భూమి వివరాలు వారి ఆధార్ కార్డు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రైతులు ఆర్డర్ కన్ఫర్మేషన్ అవ్వగానే ఆ సమీపంలోని ఫర్టిలైజర్ దుకాణం లొకేషన్ యాడ్ అవుతుందన్నారు. రైతులు మరుసటి రోజు సంబంధిత ఫర్టిలైజర్ దుకాణంలో యూరియా, ఎరువులు తీసుకోవచ్చని తెలిపారు. సాగు చేసే ఎకరాల ఆధారంగా పలు విడతల్లో యూరియా బస్తాలను రైతులు తీసుకోవాలని, ఎకరం విస్తీర్ణం లోపు సాగు చేసే రైతు ఒకే విడతలో తీసుకోవచ్చని వివరించారు. ఒక ఎకరం నుంచి ఐదెకరాల విస్తీర్ణం సాగు చేసే రైతులు రెండు వాయిదాలలో, ఐదు నుంచి 20 ఎకరాల విస్తీర్ణం సాగు చేసే రైతులు నాలుగు వాయిదాలలో ఎరువు బస్తాలను తీసుకోవచ్చని వెల్లడించారు. ఒక విడత ఎరువులు తీసుకున్న తర్వాత, తదుపరి స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ఖచ్చితంగా 15 రోజుల వ్యవధి ఉండాలన్నారు. ఈ మొబైల్ అప్లికేషన్‌పై స్థానికంగా ఉండే మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఏఈఓలకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. సహకార సంఘాలకు, డీఎస్‌డీఎస్ సభ్యులు అండ్ ఆల్ ఫర్టిలైజర్ షాప్ కీపర్స్‌కి కూడా అవగాహన కల్పించామని తెలిపారు. ఇతర సమాచారానికి రైతులు సమీప మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల కార్యాలయాల్లో సంప్రదించాలని కలెక్టర్ వెల్లడించారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ టీఎస్.దివాకర


