తప్పుడు కేసులు పెట్టడం సరికాదు
జాతీయ రహదారిపై కాంగ్రెస్ ధర్నా
ములుగు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ మీద కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఈడీ కేసులు పెట్టడం సరికాదని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఈ మేరకు గురువారం ములుగు జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేంద్ర ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, వంగ రవి యాదవ్, చింతనిప్పుల భిక్షపతి, జయపాల్‌రెడ్డి, భగవాన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చాంద్‌పాషా, శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.


