వనదేవతలకు భక్తుల మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను భక్తులు బుధవారం దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి మేడారానికి వచ్చిన భక్తులు జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన నల్లాల కింద పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, కానుకలు, చీరసారె, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. యాటలను, కోళ్లను అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. దర్శనం అనంతరం భక్తులు మేడారం అటవీ ప్రాంతంలో విడిది చేసి వంటావార్పు చేసుకుని కుటుంబ సమేతంగా భోజనాలు చేశారు.


