కొంగాల ఉపసర్పంచ్ ఎన్నికపై ఆందోళన
వాజేడు: మండల పరిధిలోని జగన్నాథపురం పోలింగ్ కేంద్రం వద్ద ఉప సర్పంచ్ ఎన్నికపై ఓ వర్గం వారు ఆందోళనకు దిగి ఎన్నికల సిబ్బంది బస్సు ఎదుట బైటాయించారు. కొంగాల గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పదవిని తమ వర్గానికే ఇస్తామని ఎన్నికల ముందస్తుగా హామీనిచ్చి తీరా పోలింగ్, కౌంటింగ్ అయిన తర్వాత ఎన్నిక నిర్వహించి తోట నాగేశ్వరావును ఉపసర్పంచ్‌గా ఎన్నుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికను వెంటనే రద్దు చేసి ఉప సర్పంచ్ పదవిని దళిత వర్గం నుంచి ఎన్నికై న వారికి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో అక్కడ ఉన్న ఎన్నికల సిబ్బంది పోలీసులకు ఫోన్ చేయడంతో వారు అక్కడికి వచ్చి ఽఆందోళన చేస్తున్న వారికి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించుకోవాలని నచ్చజెప్పి పంపించారు.


