గడువులోగా పనులు పూర్తిచేయాలి
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కాంట్రాక్టర్లను ఆదేశించారు. మండల పరిధిలోని జీపీ ఎన్నికలు సోమవారం మేడారంలోని అమ్మవార్ల గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, పగిడిద్దరాజు, గోవిందరాజు నూతన గద్దెల రాతి నిర్మాణం పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించడంతో పాటు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందుగా మంత్రి సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పాల్గొన్నారు.


