చెక్‌డ్యామ్ నిర్మాణంపై కదలిక
మంగపేట : మండలంలోని చీపురుదుబ్బ సమీపం నుంచి పారుతున్న కప్పవాగుపై చెక్‌డ్యామ్ నిర్మించేందుకు సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. సుమారు 600 ఎకరాలకు పైగా రైతులకు సాగునీరు అందించేందుకు 1986లో నిర్మించిన చెక్‌డ్యామ్‌పై ప్రస్తుతం ఆనవాళ్లు లేకుండా కొట్టుకు పోయింది. ఐటీడీఏ, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంపై ఈ నెల 10న ‘చెక్‌డ్యామ్ నిర్మాణం కలేనా’ అనే కథనాన్ని సాక్షి దినపత్రిక ప్రచురించింది. దీంతో అధికారులు స్పందించారు. చెక్‌డ్యామ్ నిర్మాణానికి ఎస్టిమేట్ నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు ఏటూరునాగారం సబ్ డివిజన్ అధికారులు తెలిపారు. పరిశీలనలో రీమార్కులు రావడంతో సవరించి ఎస్‌ఎస్‌ఆర్ 2024–25లో రూ.3.41కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారుల్లో ఒకరు సాక్షికి తెలిపారు. సాక్షి కథనంతో వెలుగులోకి చెక్‌డ్యామ్ పనుల్లో చలనం రావడంతో గిరిజన రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


