
పునరావాస కేంద్రం ఏర్పాటు
మంగపేట: మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని బుధవారం రాత్రి ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని పొదుమూరు సమీపంలోని గోదావరి బ్యాక్ వాటర్ గౌరారంవాగు, బోరునర్సాపురం బ్రిడ్జి వరకు పోటెత్తడంతో పాటు క్రమంగా వరదనీరు పొదుమూరులోని లోతట్టు ప్రాంతమైన ముస్లింవాడకు చేరుకునే అవకాశం ఉండంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 16 కుటుంబాలకు చెందిన 52 మంది బాధితులను జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. బాధితులకు భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, మండల స్పెషలాఫీసర్ సిద్ధార్థ రెడ్డి, ఎంపీడీఓ భద్రునాయక్, ఎస్సై టీవీఆర్ సూరి, పంచాయతీ కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు.