
ఉగ్ర గోదావరి
రెండు గ్రామాలకు
పడవ ప్రయాణం
ఎగువ నుంచి గోదావరిలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద
వింత వాతావరణం
గోదావరి ప్రమాద హెచ్చరికల వివరాలు..
ఏటూరునాగారం: గోదావరిలోకి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం
మండల పరిధిలోని రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరిలోకి నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరడంతో బుధవారం సాయంత్రం 6 గంటలకు వరద నీరు రెండో ప్రమాద హెచ్చరికను దాటి 16.20 మీటర్ల వేగంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 17.33 మీటర్లకు చేరితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్లు వెల్లడించారు. కడెం ప్రాజెక్టు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఇంకా ఎత్తి ఉంచడంతో వరదనీరు భారీగా వచ్చి గోదావరిలో కలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి కూడా భారీగా వరద గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో తుపాకులగూడెంలోని సమ్మక్క బ్యారేజీ వద్ద 10.72 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఏటూరునాగారంలోని జంపన్నవాగు సంగపాయవద్ద గోదావరి, వాగు రెండు కలవడంతో గోదావరి ఉధృతి మరింత పెరిగింది. కరకట్టకు ఆనుకొని ప్రవహించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఓడవాడ ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరడంతో దసరా, జమ్మి ప్రాంతాలు నీట మునిగాయి.
పునరావాస కేంద్రాలకు తరలింపు
గోదావరి వరద పోటు ఒక్కసారిగా ఎక్కువ కావడంతో రెవెన్యూ పంచాయతీరాజ్, ఇరిగేషన్, పోలీస్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఓడవాడ, దళితకాలనీ ప్రాంతాల్లోని ప్రజలను క్రాస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన పునరావస కేంద్రమైన గిరిజన భవన్‌కు తరలిస్తున్నారు. మండలంలోని రామన్నగూడెం, రాంనగర్ ప్రాంతాల్లోని ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ప్రజలు ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దని జాలర్లు చేపలు వేటకు వెళ్లొద్దని ఆదేశించారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం
గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆయా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు,గా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలను చేపట్టాయి. ముఖ్యంగా ఏటూరునాగారంలోని ఓడవాడ, మానసపల్లి, రామన్నగూడెం పుష్కర ఘాట్, రాంనగర్ లోని ఆయా ప్రాంతాల్లో బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలను తరలించడానికి ఆయా శాఖల అధికారులు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్‌కుమార్, తహసీల్దార్ జగదీశ్వర్ వరద ఉధృతిని అంచనా వేస్తూ ప్రజలను తరలించడానికి వాహనాలను సిద్ధం చేస్తున్నారు.
మండల పరిధిలోని కొండాయి, ఎలిశెట్టిపల్లి గ్రామాలకు రెండు రోజులుగా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పడవలను నడపకుండా పక్కనబెట్టారు. వాగులోని వరద తగ్గుముఖం పట్టడంతో అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు సతీష్, వినోద్‌లు పడవల ద్వారా ప్రజలను జంపన్నవాగు దాటిస్తున్నారు. పడవలకు ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేయడంతో వారి సాయంతో ప్రజలను క్షేమంగా ఒడ్డుకు చేర్చుతున్నారు.
మూడో ప్రమాద హెచ్చరికకు
చేరువలోకి..
అప్రమత్తమైన అధికారులు
పునరావాస కేంద్రాలకు
తరలింపునకు చర్యలు
రెండు గ్రామాలకు పడవ ప్రయాణం
మొదటి ప్రమాద హెచ్చరిక 14.83 మీటర్లు
రెండో ప్రమాద హెచ్చరిక 15.83 మీటర్లు
మూడో ప్రమాద హెచ్చరిక 17.33 మీటర్లు
ప్రస్తుత నీటిమట్టం 16.20 మీటర్లు
ఏటూరునాగారంగ్రామంలో బుధవారం మధ్యాహ్నం ఓవైపు సూర్యుడు ప్రకాశిస్తుండగానే భారీ వర్షం కురిసింది. దీంతో ఒకేసారి అటు ఎండ, ఇటూ వర్షం రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఉగ్ర గోదావరి

ఉగ్ర గోదావరి

ఉగ్ర గోదావరి

ఉగ్ర గోదావరి