రవళికకు మంత్రి సీతక్క పరామర్శ | - | Sakshi
Sakshi News home page

రవళికకు మంత్రి సీతక్క పరామర్శ

Apr 22 2025 1:15 AM | Updated on Apr 22 2025 1:15 AM

రవళిక

రవళికకు మంత్రి సీతక్క పరామర్శ

ములుగు రూరల్‌: ములుగు ఏరియా ఆస్పత్రిలో ప్రసవ సమయంలో బిడ్డను కోల్పోయిన రవళిక హనుమకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం పరామర్శించారు. ఈ మేరకు ఆరోగ్య విషయంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రవళిక వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని, బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

అక్రమ గ్యాస్‌ సిలిండర్ల

పట్టివేత

గోవిందరావుపేట: మండల పరిధిలోని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టి అక్రమ గ్యాస్‌ సిలిండర్లు పట్టుకున్నారు. మండలంలోని వివిధ హోటళ్లు, గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేసే షాపులు, చికెన్‌ సెంటర్లు, టీ స్టాల్స్‌, కిరాణ షాపుల్లో సివిల్‌ సప్లయీస్‌ జిల్లా అధికారి ఫైసల్‌ హుస్సేన్‌, ములుగు, ఏటూరునాగారం డిప్యూటీ తహసీల్దార్లు, పౌర సరఫరాల శాఖల అధికారులు తనిఖీ నిర్వహించారు. నిబంధనల మేరకు పలువురిపై కేసు నమోదు చేశారు. అనంతరం పలు సూచనలు చేశారు.

ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా కన్వీనర్‌గా సతీష్‌

వెంకటాపురం(కె): ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా కన్వీనర్‌గా పర్శిక సతీష్‌ను నియమించారు. ఈ మేరకు మండల కేంద్రంలో సోమవారం ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం శ్రీను హాజరయ్యారు. ఆయన సమక్షంలో జిల్లా కన్వీనర్‌గా సతీష్‌, కో కన్వీనర్‌గా టింగ బుచ్చయ్య, పాయం భారతి, కుర్సం శివశంకర్‌, తాటి రామచందర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5న ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ చేపట్టనున్న కలెక్టరేట్‌ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు.

శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత పాలిటెక్నిక్‌ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి కోరారు. సింగరేణి పాఠశాలలోని శిక్షణ తరగుతులను జీఎం సోమవారం సందర్శించి మాట్లాడారు. సింగరేణి ఎడ్యుకేషన్‌ సొసైటీ ద్వారా ప్రతీ సంవత్సరం రూ.45 కోట్లను విద్యకు ఖర్చు చేస్తుందన్నారు. ఏరియా పరిసర ప్రాంతాల పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికార ప్రతినిధి మారుతి, ప్రధానోపాధ్యాయురాలు ఝూన్సిరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

స్లాట్‌ విధానాన్ని

ఉపసంహరించుకోవాలి

భూపాలపల్లి అర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ విధానాన్ని ఉపసంహరించుకోవాలని జిల్లా డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బొడ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కొనసాగించాలని, డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్స్‌లు ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నమన్నారు. అనంతరం ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రాజేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్‌ రైటర్లు బుర్ర అశోక్‌, జితేందర్‌, వినోద్‌, రమేష్‌, విజయ్‌, ప్రశాంత్‌, విక్రమ్‌, రాజేష్‌, రాజు, సదానందం, సునిల్‌ పాల్గొన్నారు.

రవళికకు మంత్రి సీతక్క పరామర్శ 
1
1/2

రవళికకు మంత్రి సీతక్క పరామర్శ

రవళికకు మంత్రి సీతక్క పరామర్శ 
2
2/2

రవళికకు మంత్రి సీతక్క పరామర్శ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement