మేడారం జాతర చైర్‌పర్సన్‌గా ఇర్ప సుకన్య?
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతర కమిటీని ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిసింది. తాడ్వాయికి చెందిన ఇర్ప సుకన్యను జాతర కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించనున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జాతర కమిటీలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేయనున్నట్లు తెలిసింది. చైర్‌పర్సన్‌తో పాటు కమిటీ డైరెక్టర్లుగా మహిళలను నియమించనున్నట్లు సమాచారం. ఈ సారి జాతర కొత్తదనంతో నిర్మితమవుతున్న తరుణంలో కమిటీలో కూడా మహిళలకే ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జాతర కమిటీని ప్రభుత్వం దాదాపు ఖరారు చేసినట్లు తెలియగా ఇంకా అధికారంగా ఉత్వర్వులు వెలువడలేదు.


