డిగ్రీ కళాశాలలో మాక్ అసెంబ్లీ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేణుక నిర్వహించారు. కళాశాలలోని విద్యార్థులు రాజకీయ నాయకులుగా మారి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీలో చర్చించే విషయాలు, తీర్మాణాల వంటి అంశాలను స్పీకర్ ద్వారా పోటీ పోటీగా చర్చించారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్‌పర్సన్‌గా ములుగు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం వ్యవహరించి మాక్ అసెంబ్లీని నడిపించారు. విద్యార్థుల పరీక్షలు, వారి సిలబస్స్, రాజకీయ నాయకుల విధి విధానాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రమేష్, నవీన్, వెంకటయ్య, జ్యోతి, కనీఫ్‌ఫాతిమా, సంపత్, భాస్కర్, అభిలాష, జీవవేణి, మున్ని, సుమలత, భావన, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


