దంచికొట్టిన వడగండ్ల వాన
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/మంగపేట: ఏజెన్సీలో వడగళ్లవాన దంచికొట్టింది. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం(కె) మండలాల పరిధిలో సోమవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడడంతో కల్లాల్లో ఆరబోసిన మిర్చి, ధాన్యం తడిసిపోయింది. రాళ్ల వానతో ధాన్యం గింజలు రాలిపోయాయి. దీంతో రైతులు ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంట నీటి పాలవుతుందని కన్నీటి పర్యంతమయ్యారు. ఏటూరునాగారం మండల పరిధిలోని రొయ్యూర్‌లో రాళ్లతో కూడిన వర్షం పడడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భారీ స్థాయిలో పిడుగులు పడడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ప్రజలు అంధకారంలోనే ఉన్నారు. వెంకటాపురం(కె) మండల పరిధిలోని టేకులబోరు గ్రామ సమీపంలో గాలివాన బీభత్సానికి ఓ భారీ చింతచెట్టు నేలకూలి విద్యుత్ లైన్లపై పడడంతో మూడు స్తంభాలు విరిగిపోయాయి.
300ఎకరాలకు పైగా వరిపంటకు నష్టం
మంగపేట మండలంలోని వాడగూడెం, పాలాయిగూడెం, చుంచుపల్లి, కొత్తమల్లూరు, మల్లూరు, తిమ్మంపేట, నర్సింహాసాగర్, పూరేడుపల్లి తదితర గ్రామాల్లో రాళ్లవర్షం కురిసింది. దీంతో వాడగూడెంలోని గోదావరి ఇసుక తిన్నెలపై ఆరబోసిన వందల క్వింటాళ్ల మిర్చి, బస్తాలో తొక్కి మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 200కు పైగా మిర్చి బస్తాలు తడిసిపోయినట్లు రైతులు వాపోయారు. 70ఎకరాల్లోని మిర్చి పంట ధ్వంసమైనట్లు తెలిపారు. అదే విధంగా ఆయా గ్రామాల్లో కోత దశలో ఉన్న 300కు పైగా ఎకరాల్లోని వరి పంట రాళ్ల వర్షం దాటికి ధాన్యం రాలిపోయిన పరిస్థితి నెలకొంది. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ములుగు రూరల్/గోవిందరావుపేట: అకాల వర్షంతో ములుగు మండల పరిధిలోని అంకన్నగూడెం –సర్వాపూర్ గ్రామాల మధ్య విద్యుత్ స్తంభాలు విగిరిపోయాయి. కొత్తూరు– రాయినిగూడెం గ్రామాల మధ్య విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సర్వాపూర్ వెళ్లే దారిలో రహదారిపై చెట్టు విరిగిపడిపోయింది. కాశిందేవిపేటలో నాగదేవత గుడి పై రేకులు ఎగిరిపోయి రోడ్డుపై పడ్డాయి.అదే విధంగా గోవిందరావుపేట మండలంలోని పస్రా– నాగారం ఎస్సీ కాలనీ వద్ద మేడారానికి వెళ్లే రహదారిలో గాలివానకు రోడ్డుపై అడ్డుగా చెట్టు పడిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు కొద్దిసేపు అంతరాయం నెలకొంది. స్పందించిన పస్రా ఎస్సై అచ్చ కమలాకర్ రోడ్డు పై పడిపోయిన చెట్టును సిబ్బంది సహాయంతో తొలగించారు.
రోడ్డు పై వర్షానికి విరిగిపడిన చెట్టును తొలగిస్తున్న పస్రా ఎస్సై కమలాకర్
నర్సింహా
సాగర్‌లో
రాళ్ల వానకు
రాలిపోయిన ధాన్యం
గాలివాన బీభత్సం..
కల్లాల్లో తడిసి ముద్దయిన మిర్చి, ధాన్యం
రాళ్లవానతో నేలరాలిన ధాన్యం గింజలు
దంచికొట్టిన వడగండ్ల వాన
దంచికొట్టిన వడగండ్ల వాన
దంచికొట్టిన వడగండ్ల వాన
దంచికొట్టిన వడగండ్ల వాన
దంచికొట్టిన వడగండ్ల వాన


