ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

Mar 26 2025 1:03 AM | Updated on Mar 26 2025 12:59 AM

బుధవారం శ్రీ 26 శ్రీ మార్చి శ్రీ 2025
జిల్లాలో 62 సన్నాలు, 83 దొడ్డు రకం కేంద్రాలు
నేడు డీపీఓతో ఫోన్‌ ఇన్‌

8లోu

ములుగు: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. చెరువులు, బోరుబావుల కింద జిల్లాలోని 10మండలాల్లో ఈ సారి 55వేల ఎకరాల్లో వరిపంట సాగు అయ్యింది. మంగపేట, గోవిందరావుపేట, వెంకటాపురం(కె), వాజేడు మండలాల్లో మరో 15 రోజుల్లో అక్కడక్కడా పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల కసరత్తును ప్రారంభించిన సివిల్‌ సప్లయీస్‌ శాఖ క్షేత్రస్థాయిలో కేంద్రాలకు అనుకూలమైన ప్రదేశాలను అన్వేషిస్తోంది.

145 కేంద్రాల ఏర్పాటు

యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ సారి మొత్తం 145 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా సన్నాలు, దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సన్నాలకు మద్దతు ధరతో పాటు ప్రభుత్వ ప్రకటన ప్రకారం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ప్రభుత్వం ఇవ్వనుండడంతో కొనుగోలు, ధాన్యం తరలింపు విషయంలో అవాంతరాలు ఎదురుకాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. సన్నాలకు 62 కేంద్రాలు, దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు 83 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రెండు రకాల ధాన్యం సాగుచేసిన రైతుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని పక్కపక్కనే కేంద్రాలు ఉండేలా చూస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.

అధికారులకు మూడు రోజుల అవగాహన

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధి కారులు, కేంద్రాల నిర్వహకులకు మంగళవా రం నుంచి గురువారం వరకు మూడు రోజుల పాటు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు(బుధవారం)ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని రైతు వేదికలో గోవిందరావుపేట, ఎస్‌ఎస్‌ తాడ్వా యి మండలాలకు, గురువారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ములుగు, వెంకటాపురం(ఎం) మండలాలకు చెందిన అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సమావేశం జరగనుంది.

టార్పాలిన్ల కొరత

145 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు వచ్చే సమయంలో వాతావరణ ఇబ్బందులు ఎదురైతే వినియోగించేందుకు టార్పాలిన్‌ కవర్ల కొరత ఉన్నట్లుగా తెలుస్తుంది. జిల్లాలో 2,900 టార్పాలిన్‌ కవర్లు అవసరం ఉన్నట్లుగా నివేదిక సిద్ధం చేశారు. 2,239 మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇంకా 661టార్పాలిన్‌ కవర్లు అవసరం ఉన్నట్లు అధికారులు ఉన్నతాధికారులకు వివరించారు. అలాగే ఆటోమెటిక్‌ ప్యాడీ క్లినర్లు అందుబాటులో లేని పరిస్థితి ఉంది.

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు

జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోలుకు 145కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఎక్కడైనా వరి కోతలు ప్రారంభమైతే అక్కడ కేంద్రాన్ని నడిపించి కొనుగోలు చే స్తాం. సన్నాలకు, దొడ్డు రకానికి వేర్వేరుగా కేంద్రాలు ఉంటాయి. మరో 15నుంచి 20 రోజుల్లో కోతలు ముమ్మరం అవుతాయని అనుకుంటున్నాం. ఇప్పటి కే కలెక్టర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు నడుచుకుంటాం. వచ్చే నెల 2వ తేదీన పే రూరు వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తాం.

– రాంపతి, సివిల్‌ సప్లయీస్‌ డీఎం

సమయం : ఉదయం 9 నుంచి 10 గంటల వరకు

తేదీ : 26–03–2025(బుధవారం)

ఫోన్‌నంబర్‌ : 9848792788

జిల్లాలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లు, పరికరాల వివరాలు..

న్యూస్‌రీల్‌

మూడు రోజుల పాటు

అధికారులకు అవగాహన

పేరూరు వద్ద

అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ ఏర్పాటు

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు1
1/4

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు2
2/4

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు3
3/4

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు4
4/4

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement