ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
ములుగు:
జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగింది. 2024లో 1,066 కేసులు నమోదు కాగా 608 కేసులను ఛేదించారు. 2025లో 1,118 కేసులు నమోదు కాగా అందులో 646 కేసులను పరిష్కరించారు. గతేడాది కంటే ఈ ఏడాది కేసుల సంఖ్య 52 పెరగడంతో దోషులకు శిక్ష పడేలా పోలీసులు విశేష కృషి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎప్పటికప్పుడు కేసులలో పురోగతి సాధిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేస్తున్నారు. సగానికంటే ఎక్కువ కేసులను పోలీసులు పరిష్కరించి దోషులకు శిక్షపడేలా చేశారు.
44 సైబర్ కేసుల నమోదు
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 44 సైబర్ కేసులు నమోదయ్యాయి. వాటిని ఛేదించి రూ.6,92,994లు రికవరీ చేసి లోక్ అదాలత్‌లో బాధితుల ఖాతాకు తిరిగి చెల్లించారు. కళా శాలలు, పాఠశాలలు, గ్రా మాల్లో సైబర్ క్రైమ్‌పై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. జిల్లాలో మహిళలు, పిల్లలపై జరిగిన దాడుల ఘటనలపై 183 కేసులు నమోదయ్యాయి. వివిధ ప్రమాదాల్లో 69 మంది మృత్యువాత పడగా 132 మందికి గాయాలయ్యాయి.
ములుగు రూరల్: చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావుతో రేపు సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్‌లో సంప్రదించాలి.
తేది: 29–12–2025 సోమవారం
సమయం
ఉదయం 11.30 నుంచి 12.30 గంటల వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్లు
6281952139, 9989830060
మావోయిస్టుల లొంగుబాటు
2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు 85 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో డీవీసీఎంఎస్ కేడర్‌కు చెందిన ముగ్గురు, ఏసీఎంఎస్ కేడర్‌కు చెందిన 12 మంది, మావోయిస్టు పార్టీ సభ్యులు 28 మంది, మిలీషియా సభ్యులు 32 మంది, ఆర్‌పీసీ ఒకరు, డీఏకేఎంఎస్ సభ్యులు ఇద్దరు, సీఎన్‌ఎం సభ్యులు ఏడుగురు లొంగిపోగా వారికి పునరావస పథకం కింద తక్షణ సహాయం అందించారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిస్తే వారికి అవసరమైన సదుపాయాలు పోలీసుశాఖ తరఫున కల్పిస్తున్నారు.
మేడారం జాతరపై దృష్టి
జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారంలో జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతరపై ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఇప్పటి నుంచే భద్రతపరమైన చర్యలు తీసుకుంటున్నారు. వారంలో నాలుగు రోజులు మేడారాన్ని సందర్శిస్తూ పోలీసుశాఖ పరంగా చేపట్టే బందోబస్తుపై అధికారులతో చర్చిస్తున్నారు. సుమారు 10 వేల మంది పోలీసులతో జాతర బందోబస్తు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. మేడారం జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తూ భక్తులు అమ్మవార్లను దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరేలా పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


