హేమాచలుడిని దర్శించుకున్న అడ్వకేట్ జనరల్
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి కుటుంబ సబ్యులతో కలిసి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనను ఆలయ ఈఓ మహేశ్, పూజారులు మర్యాద పూర్వకంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభు స్వామివారికి ఆయన గోత్రనామాలతో అర్చన జరిపించారు. ఆలయ పురాణం, స్వామివారి విశిష్టతను ఆలయ అర్చకులు వివరించి వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
హరేకృష్ణ రథోత్సవం
భూపాలపల్లి అర్బన్: బంజారాహిల్స్ గోల్డ్‌న్ టెంపుల్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జిల్లా కేంద్రంలో హరినామ నగర సంకీర్తన రథోత్సవం నిర్వహించారు. స్థానిక హన్‌మాన్ దేవాలయం నుంచి జయశంకర్ సెంటర్ వరకు సంకీర్తన చేపట్టారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ రథయాత్రను ఆలయ ధర్మకర్తలు గండ్ర జ్యోతి జెండాఊపి ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కృష్ణగీతాలు, డప్పుచప్పుళ్లతో నృత్యాలు చేపట్టారు. శ్రీవారి నామస్మరణం, హరేకృష్ణ కీర్తనలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హేమాచలుడిని దర్శించుకున్న అడ్వకేట్ జనరల్


