మేడారంలో ఎస్పీ పర్యటన
ఏటూరునాగారం: నేడు ఆదివారం కావడంతో వనదేవతలను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా చర్యల్లో భాగంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనివారం మేడారం పర్యటించారు. గద్దెలకు భక్తులు చేరుకునే మార్గాలు, దర్శనం అనంతరం బయటకు వెళ్లే ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అలాగే వాహనాలను మళ్లించాలన్నారు. నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు పెడితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే గద్దెల వద్ద జరుగుతున్న సాలారం పనులు పరిశీలించారు.


