శరవేగంగా కాజ్‌వే పనులు
ఏటూరునాగారం: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వేలాది మంది భక్తులు మేడారం ఊరట్టం కాజ్‌వే ద్వారానే చేరుకునేవారు. నాలుగేళ్ల క్రితం భారీ వర్షాలకు ఊరట్టం కాజ్‌వే కొట్టుకుపోయింది. దీంతో ఎడ్లబండ్లలో జాతరకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో ఈ ఏడాది ఎట్టకేలకు ఊరట్టం–కొండాయి కాజ్‌వేను కాంక్రీట్‌తో నిర్మాణం పనులు చేపట్టగా శరవేగంగా పనులు సాగుతున్నాయి. ప్రతీ జాతర సమయంలో కాజ్‌వే నుంచి ఎడ్లబండ్లు జాతర సమీపంలోకి రావడం ఆనవాయితీగా వస్తుంది. ఊరట్టం కాజ్‌వేపై నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గిరిజనులు, ఏటూరునాగారం, సమీప అడవి ప్రాంతాల నుంచి వచ్చే ఎడ్లబండ్లు సైతం ఈ దారిగుండా వచ్చేందుకు ప్రత్యేకంగా ఈ కాజ్‌వేను నిర్మిస్తున్నారు. ఇప్పటికే జంపన్నవాగుపై రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఈ ఊరట్టం కాజ్‌వే కేవలం ఎడ్లబండ్లకోసమేనని అధికారులు చెబుతున్నారు. జనవరి 10వ తేదీలోపు ఈ కాజ్‌వే అందుబాటులోకి వస్తుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.


