అడవికి నిప్పు పెట్టొద్దు
● ఏటూరునాగారం నార్త్ రేంజ్ అధికారి అప్సర్‌నిస్సా
కన్నాయిగూడెం: అడవులకు నిప్పు పెట్టొద్దని ఏటూరునాగారం నార్త్ రేంజ్ అధికారి ఎండీ.అప్సర్‌నిస్సా అన్నారు. మండల పరిధిలోని కంతనపల్లి గ్రామ పంచాయతీలో గొత్తికోయగూడెం, బంగారుపల్లిలో ప్రజలకు శనివారం అటవీ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవులకు నిప్పు పెడితే మానవాళి మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరించారు. అలాగే అనేక జీవరాసులు మృత్యువాత పడుతాయని వివరించారు. అడవులు అంతరిస్తే వర్షాలు సైతం తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉందన్నారు. అటవీశాఖ సెక్షన్ అధికారులు రవి, తార, సిబ్బంది రవివర్మ, వినోద్, మోహన్, యూసప్, రాజేంద్రప్రసాద్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.


