వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సోమవారం రష్యా దేశస్తులు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. హిందూ మతం స్వీకరించి ఆలయాలను వారు సందర్శిస్తున్నట్లు వెల్లడించారు.
210 చలివేంద్రాలు..
360 నీటితొట్లు
ములుగు: వేసవిలోని వేడిగాలులు, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ములుగు జిల్లా పంచాయతీశాఖ తరఫున వినూత్న ఆలోచన చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 10 మండలాల్లో 174 గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రధాన కూడళ్లు, రహదారులు, షాపింగ్ ప్రాంతాలు, ఆస్పత్రుల వద్ద 210 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా గ్రామ పంచాయతీ ఆవరణలు, గ్రామ సమీపంలోని ఖాళీ ప్రదేశాలు, నర్సరీలు, రహదారి వెంబడి పక్షులు, మూగజీవాలు, కోతులు నీళ్లు తాగే విధంగా 360ప్లాస్టిక్ టబ్స్, తాగునీటి తొట్లు ఏర్పాటు చేశారు. డీపీఓ ఒంటేరు దేవరాజ్ సూచనల మేరకు చిన్న గ్రామ పంచాయతీల్లో ఒకటి, మేజర్ గ్రామ పంచాయతీల్లో మూడు నుంచి 5 చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సోమవారం ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.
రామప్పను సందర్శించిన రష్యా దేశస్తులు