
ములుగు: ములుగు నియోజకవర్గంలో మంగళవారం రెండో నామినేషన్ దాఖలైంది. ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ మహబూబాబాద్ జిల్లా పరిధిలోని గంగారం మండల కేంద్రానికి చెందిన వజ్జా సమ్మక్క సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ తరఫున ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీఓ అంకిత్‌కు నామినేషన్ అందించారు.
ఓటు వినియోగంపై
కార్మికులకు అవగాహన
భూపాలపల్లి అర్బన్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై అధికారులు సింగరేణి కార్మికులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఏరియాలోని కేటీకే 1వ గనిలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిల్‌కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి ప్రాంతాల్లో ఓటింగ్‌శాతం తక్కువగా ఉంటుందని కార్మికులు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తప్పకుండా వినియోగించుకుంటామని కార్మి కులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ వెంకట్రావ్, అధికారులు సాధన్, పాండే, సాగర్, విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణకాంత్ పాల్గొన్నారు.
పాఠశాలల తనిఖీ
చిట్యాల: మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కాకతీయ హైస్కూ ల్, ఎమ్మార్సీ కార్యాలయాన్ని జిల్లా సెక్టోరియల్ అధికారి రాజగోపాల్, ఏఎస్‌ఓ కర్ణాకర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. అనంతరం పాఠశాలను సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. యూడైస్ ప్లేస్ డాటా ఎంట్రీని 100 శాతం పూర్తిచేయాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి వివరాలు ఆధార్‌తో అనుసంధానం చేయాలని కోరారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల శక్తి సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ పర్సన్ మహేందర్‌రెడ్డి, డీఈఓ కార్యాలయ సిబ్బంది కిషన్‌రెడ్డి, సీఆర్‌పీ రాజు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భిక్షపతి, రాజ్‌మహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం
చిట్యాల: మండలంలోని శాంతినగర్‌లో ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పత్తిని బాగా అరబెట్టి 12శాతం లోపు తేమ ఉండే విధంగా తీసుకురావాలన్నారు. కాయ లేకుండా నాణ్యమైన పత్తిని తీసుకుని కొనుగోలుకేంద్రానికి రావాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.7020 మద్దతు ధర పొందాలని తెలిపారు.