ఓటరు జాబితాపై నాయకుల అభ్యంతరం
ములుగు: ములుగు మున్సిపాలిటీలో ఓటరు జాబితాపై వివిధ పార్టీల నేతలతో సోమవారం నిర్వహించిన సమావేశంలో నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటరు జాబితాలో తప్పులు ఉన్నాయని, మృతుల పేర్లు కూడా జాబితాలో ఎలా ప్రదర్శించారని అధికారులను ప్రశ్నించారు. ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తానని మున్సిపాలిటీ కమిషనర్ జనగాం సంపత్ తెలిపారు. ఓటరు జాబితాపై ప్రజల నుంచి ఇప్పటి వరకు 31 అభ్యంతరాలు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని రష్యా దేశానికి చెందిన ఇరినా, అమీయాలు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు.
ఏటూరునాగారం: క్రీడల్లో గెలుపోటములు సహజమని అటవీశాఖ దక్షిణ రేంజర్ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మండల కేంద్రంలోని కొమురం భీం స్టేడియంలో అటవీ సంరక్షణ కార్యక్రమంలో భాగంగా సోమవారం వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో నాలుగు జట్లు పాల్గొనగా ఎక్కెల టీంకు మొదటి బహుమతి, కొమురం భీం నగర్ టీం రెండో బహుమతి గెలుచుకున్నట్లు అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఆర్‌ఓ నారాయణ, ఎఫ్‌బీఓ దయానంద్, కల్యాణ్, చిట్టి, రాజేష్, ప్రశాంత్, పవన్, దిలీప్ పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి ఎన్నిక
ములుగు: ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్ (పీఎస్‌హెచ్‌ఎం) జిల్లా యూనియన్‌ను సోమవా రం గోవిందరావుపేట మండలంలోని పీవీఆర్ కన్వెన్షన్ హాల్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మధు, ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శిగా వేణుగోపాల్, కోశాధికారిగా నాగేశ్వర్‌రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు విలువలతో కూడిన, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా హెడ్‌మాస్టర్లు పనిచేయాలని సూచించారు.
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఓటరు జాబితాపై నాయకుల అభ్యంతరం
ఓటరు జాబితాపై నాయకుల అభ్యంతరం
ఓటరు జాబితాపై నాయకుల అభ్యంతరం
ఓటరు జాబితాపై నాయకుల అభ్యంతరం


