బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని భారతి విద్యానికేతన్, విజన్ స్కూల్‌లో బాలల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ నిషేధ చట్టంపై విద్యార్థులకు అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల పరిరక్షణ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బాల్య వివాహాల చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల్య వివాహలతో బాలికల చదువు, ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు. 18 ఏళ్ల లోపు అమ్మాయిలు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలకు వివాహాలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ సమితి సభ్యులు జ్యోతి, సుమన్, రాజు రజిని పాల్గొన్నారు.


