ఈసారి తెలుగమ్మాయిని పరిచయం చేస్తున్నాను: వైవీఎస్‌ చౌదరి | YVS Chowdary Lineup Legendary Personalities For His New Film | Sakshi
Sakshi News home page

ఈసారి తెలుగమ్మాయిని పరిచయం చేస్తున్నాను: వైవీఎస్‌ చౌదరి

Aug 10 2024 9:53 AM | Updated on Aug 10 2024 9:53 AM

YVS Chowdary Lineup Legendary Personalities For His New Film

‘‘నేను పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లు స్టార్స్‌గా వెలిగారు. అయితే ఇందులో చాలా మంది ముంబై నుంచి వచ్చిన వారే. ఈసారి మన తెలుగమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేయాలని వీణా రావుని ఎంచుకున్నా. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెందరో ఉంటారు. అలాగే కొత్త వారికి కూడా అవకాశం ఇస్తున్నాం’’ అని డైరెక్టర్‌ వైవీఎస్‌ చౌదరి అన్నారు. దివంగత హరికృష్ణ కుమారుడు, దివంగత జానకి రామ్‌ (ఎన్టీఆర్‌ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్‌ చౌదరి ఇటీవల ఓ సినిమాని ప్రకటించారు. 

న్యూ టాలెంట్‌ రోర్స్‌ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు. కాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వీణా రావు పేరుని పరిచయం చేశారు వైవీఎస్‌ చౌదరి. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘మహేశ్‌బాబుగారి బర్త్‌ డే (ఆగస్టు 9) సందర్భంగా మా సినిమా కార్యక్రమం జరుపుకోవడం హ్యాపీ. ఈ మూవీకి కీరవాణిగారు సంగీతం అందించనుండటం నా అదృష్టం. సాయి మాధవ్‌ బుర్రా మాటలు, చంద్రబోస్‌గారి పాటలు మహాద్భుతంగా ఉండనున్నాయి’’ అన్నారు. ‘‘వైవీఎస్‌ చౌదరి, కీరవాణి, చంద్రబోస్‌ వంటి మహామహులతో పనిచేసే అవకాశం ఇచ్చిన గీతగారికి ధన్యవాదాలు’’ అని డైలాగ్‌ రైటర్‌ సాయి మాధవ్‌ బుర్రా చెప్పారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement