చైల్డ్‌ ఆర్టిస్ట్‌ యోగేశ్వరన్‌కు ప్రశంసలు | Yogeswaran Hey Sago Video Album Launched | Sakshi
Sakshi News home page

Yogeswaran: 'హే సగో' వీడియో ఆల్బమ్‌ కోసం ఆడి పాడిన బాలనటుడు

Apr 24 2022 12:00 PM | Updated on Apr 24 2022 12:00 PM

Yogeswaran Hey Sago Video Album Launched - Sakshi

'హే సగో' అనే వీడియో ఆల్బమ్‌ కోసం ఆడి పాడిన బాలనటుడు యోగేశ్వరన్‌ను పలువురు సినీ ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు. రఘురామన్, సంగీత దంపతులు రూపొందించిన వీడియో ఆల్బమ్‌ హే సగో, జై క్రిష్‌ కదీర్‌ పాటను రాసి సంగీతాన్ని సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ వీడియో ఆల్బమ్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు.

ఈ వేడుకలో దర్శకుడు పేరరసు, రాజు మురుగన్, నటుడు, నిర్మాత కె.రాజన్, గాయకుడు ఉన్నికృష్ణన్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఆల్భమ్‌ ద్వారా మంచి సంగీత ప్రయత్నం చేశారని గాయకుడు ఉన్నికృష్ణన్‌ పేర్కొన్నారు. ఇందులో ఆడి పాడిన చిన్నారి యోగేశ్వరన్‌కు ఇంత మంచి అవకాశం కల్పించి ప్రోత్సహించిన అతని తల్లిదండ్రులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కుర్రాడు మరింతగా ఎదిగి తమిళ కళలను ప్రపంచస్థాయిలో వ్యాప్తి చేయాలని కె. రాజన్‌ ఆకాక్షించారు.

చదవండి: బాడీ షేమింగ్‌ చేశారు, మట్కా అని పిలిచేవారు: జెర్సీ హీరోయిన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement