'వయసైపోయాక తండ్రిని వదిలేసే కొడుకులు ఉన్నారు కానీ..' ఆసక్తిగా టీజర్! | 'Yendira Ee Panchayati' Movie Teaser Out | Sakshi
Sakshi News home page

Yendira Ee Panchayati Movie: 'కట్టుకోబోయేవాడు మోసం చేస్తాడేమో'.. ఆసక్తిగా టీజర్!

Published Thu, Sep 14 2023 9:26 PM | Last Updated on Fri, Sep 15 2023 9:31 AM

Yendira Ee Panchayati Movie Teaser Released Today - Sakshi

భరత్, విషికా లక్ష్మణ్‌  హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలు చేసిన టైటిల్ లోగో, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. మహాభారత్‌ నటుడు కన్నుమూత!)

ఈ టీజర్‌లో అన్ని రకాల ఎమోషన్స్, యాక్షన్, కామెడీ, లవ్, థ్రిల్లర్ జానర్‌లను చూపించారు. ‘కళ్లు మోసం చేశాయేమో అని నువ్వు అంటున్నావ్.. కట్టుకోబోయేవాడు మోసం చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా’.. ‘వయసైపోయాక తండ్రిని వదిలేసే కొడుకులు ఉన్నారు కానీ.. చెడిపోయాడని కొడుకుని వదిలేసే తండ్రులు లేరు’.. అంటూ సాగే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement