పిల్లలను దూరంగా ఉంచండి! | Yash Toxic Ladies and Ladies video released | Sakshi
Sakshi News home page

పిల్లలను దూరంగా ఉంచండి!

Jul 2 2026 3:40 AM | Updated on Jul 2 2026 3:40 AM

Yash Toxic Ladies and Ladies video released

‘కేజీఎఫ్‌’ మూవీస్‌ ఫేమ్‌ యశ్‌ హీరోగా గీతూ మోహన్ దాస్‌ దర్శకత్వంలో రూ పొందిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లీష్‌) చిత్రం ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీటేల్‌ ఫర్‌ గ్రోన్  అప్స్‌’.1940–1970 కాలంలో గోవా తీర్రపాంతం నేపథ్యంతో సాగే ఈ సినిమాలో యశ్‌ ద్విపాత్రాభినయం (రాయ, టికెట్‌) చేశారు. ఈ సినిమాలో గంగ పాత్రలో నయనతార, నాడియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్‌గా హ్యూమా ఖురేషీ, రెబెక్కా పాత్రలో తారా సుతారియా, మెలిస్సా రోల్‌లో రుక్మిణీ వసంత్‌ నటిస్తున్నారు. కేవీఎన్‌  ప్రోడక్షన్స్, మాన్ స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్పై వెంకట్‌ కె.నారాయణ, యశ్‌ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది.

కాగా ‘లేడీస్‌ అండ్‌ లేడీస్‌’ అంటూ ఈ సినిమా నుంచి బుధవారం ఓ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఉమెన్  వాయిస్‌ ఓవర్‌తో ఈ సినిమా కథనం సాగుతుంది. మహిళా ఫైటర్స్‌తో యశ్‌ చేసే యాక్షన్  సీక్వెన్స్, ఈ సినిమాలోని హీరోయిన్లు ఈ వీడియోలో కనిపించారు. ‘పిల్లలూ... దూరంగా ఉండండి. తల్లిదండ్రులూ... మీ పిల్లలను దూరంగా ఉంచండి. తాతలు, బామ్మలు... మీ మనవళ్లను కూడా దూరంగా ఉంచండి. ముత్తాతలు... మీ సొంత రిస్క్‌పై చూడండి‘ అనే డిస్క్లైమర్‌తో ఈ వీడియో ప్రారంభం అవుతుంది. ఇంటెన్స్, బోల్డ్, యాక్షన్  సన్నివేశాలు ఈ వీడియోలో కనిపిస్తాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement