జాన్వీ కపూర్ ర్యాంప్‌ వాక్‌.. ఇంతకీ ముద్దుపెట్టిన ఆమె ఎవరు? | Who is the couple Janhvi Kapoor hugged after her ramp walk | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ర్యాంప్‌ వాక్‌.. ముద్దుపెట్టిన ఆమె ఎవరో తెలుసా?

Mar 30 2025 7:01 PM | Updated on Mar 30 2025 7:02 PM

Who is the couple Janhvi Kapoor hugged after her ramp walk

బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ విషయానికొస్తే హీరోయిన్లలో ఓ మెట్టు ముందు వరుసలో ఉంటుంది. గతేడాది దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన పెద్ది సినిమాలో కనిపించనుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ను ఇటీవల చెర్రీ బర్త్‌ డే సందర్భంగా రివీల్ చేశారు.

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఫ్యాషన్‌ షో మెరిసింది. తన ర్యాంప్‌వాక్‌తో అభిమానులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఈ ర్యాంప్ వాక్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన బాలీవుడ్ బ్యూటీ ఈ షోకు హాజరైన ఓ పెద్దావిడను ఆలింగనం చేసుకుంది.  దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో జాన్వీ కపూర్‌కు అప్యాయంగా ముద్దు పెట్టిన ఆమె ఎవరు? అంటూ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు.

అయియతే అక్కడ ఉన్నది శ్లోకా మెహతా తల్లిదండ్రులు మోనా, రస్సెల్ మెహతా. కాగా.. రస్సెల్ మెహతా భారతదేశంలోని వజ్రాల తయారీదారులలో ఒకటైన రోజీ బ్లూ ఇండియాను కలిగి ఉన్న  వ్యాపారవేత్త అని తెలుస్తోంది. ఆయన కుమార్తె శ్లోకా మెహతా ప్రముఖ బిలియనీర్ ముఖేశ్ అంబానీ, నీతా అంబానీలకు పెద్ద కోడలు కావడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement