ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. లైవ్ ఏ ఓటీటీలో చూడాలంటే? | Where and when to watch Oscars Academy Awards live in India | Sakshi
Sakshi News home page

Oscars- 2025: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. ఆ ఓటీటీలోనే లైవ్ స్ట్రీమింగ్

Mar 1 2025 5:18 PM | Updated on Mar 1 2025 5:29 PM

Where and when to watch Oscars Academy Awards live in India

ప్రతిష్టాత్మక సినీ ఆవార్డుల వేడుక-2025కు అంతా సిద్ధమైంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 97వ ఆస్కార్ అవార్డుల పండుగ ఆదివారం జరగనుంది. ఈ అవార్డులకు ఎంపికైన విజేతలను ఆ రోజు ప్రకటించనున్నారు. ఈ వేడుక కోసం వరల్డ్ వైడ్‌గా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుకలు జరగనున్నాయి.

(ఇది చదవండి: ఆస్కార్ నామినేషన్స్.. ఎంపికైన చిత్రాలివే.. ఫుల్ లిస్ట్ చూసేయండి)

 అయితే భారత కాలమానం ప్రకారం మనదేశంలో మార్చి 3వ తేదీ ఉదయం 5:30 నిమిషాలకు ఈ వేడుక వీక్షించే అవకాశముంది. మనదేశంలోని సినీ ప్రియులు ఈ వేడుక లైవ్‌లో చూడొచ్చు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌తో పాటు లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అంతేకాకుండా స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ సెలెక్ట్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. కాగా.. ఇప్పటికే 97వ అకాడమీ అవార్డులకు నామినీలను ఈ ఏడాది జనవరి 23న ప్రకటించారు. ఈసారి హాలీవుడ్ చిత్రం ఎమిలియా పెరెజ్ ‍అత్యధికంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది. ఆ తర్వాత్‌ వికెడ్ మూవీ 10 విభాగాల్లో నామినేషన్లను సాధించింది. ఈ ఏడాది భారతీయ సినిమాలకు మాత్రం నిరాశే ఎదురైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement