అందరూ చూస్తుండగా అతడి కాళ్లు మొక్కబోయిన సమంత! | Watch: Samantha tries to touch Karan Johar's feet | Sakshi
Sakshi News home page

Samantha: కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన సామ్‌.. అతడి రియాక్షన్‌ చూశారా?

Mar 20 2024 11:55 AM | Updated on Mar 20 2024 12:07 PM

Watch: Samantha tries to touch Karan Johar feet - Sakshi

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ మంగళవారం (మార్చి 19న) పెద్ద ఈవెంట్‌ నిర్వహించింది. త్వరలో రాబోయే సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఇవేనంటూ పెద్ద లిస్ట్‌ విడుదల చేసింది. ఆయా సినిమాలకు సంబంధించిన తారలంతా ఈ ఈవెంట్‌లో తళుక్కుమని మెరిశారు. టాలీవుడ్‌ బ్యూటీ సమంత కూడా సిటాడెల్‌ సిరీస్‌ కోసం స్టేజీపైకి వచ్చింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న హీరో వరుణ్‌ ధావన్‌.. బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ పాదాలకు నమస్కరించాడు.

దాన్ని గుర్తు చేయొద్దు
ఇంతలో సమంత సైతం అతడి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించింది. ఇది చూసిన కరణ్‌.. వద్దు, వద్దంటూ సామ్‌ను ఆపాడు. దీంతో వరుణ్‌.. అందరూ కరణ్‌ పాదాలకు నమస్కరించాల్సిందేనన్నాడు. దీనికి కరణ్‌ బదులిస్తూ.. నన్ను అప్పుడే అంత పెద్దవాడిని చేసేయొద్దు ప్లీజ్‌.. ఈ మధ్యే ఓ ఏజ్‌(50 ఏళ్లు) దాటేశాను. దయచేసి నాకు దాన్ని గుర్తు చేయొద్దు అని చెప్పాడు. అయినప్పటికీ వినని వరుణ్‌.. మీ ముఖంలో వయసు కనిపించనీయకుండా మీ స్కిన్‌ డాక్టర్‌ చాలా బాగా కష్టపడుతున్నాడు అని సెటైర్స్‌ వేశాడు.

నేనే ట్రీట్‌మెంట్‌ చేయించుకోలే
నేనేమీ అందరిలా ముఖానికి సర్జరీలు, ట్రీట్‌మెంట్‌లు చేయించుకోలేదు.. అలాంటివారిలో నేను ఒకడిని కానే కాదు అని నొక్కి చెప్పాడు కరణ్‌. ఇకపోతే సిటాడెల్‌ సిరీస్‌లో వరుణ్‌ ధావన్‌, సమంత ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సిటాడెల్‌ అనే హాలీవుడ్‌ సిరీస్‌కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఇందులో సిమ్రాన్‌, కేకే మీనన్‌, శివశక్తి సింగ్‌, సఖీబ్‌ సలీం, సిఖిందర్‌ ఖేర్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. 

చదవండి: రెమ్యునరేషన్‌ పెంచేసిన ప్రేమలు హీరోయిన్‌

Advertisement
 
Advertisement
Advertisement