కొత్తింట్లోకి బుల్లితెర నటి, గృహప్రవేశం వీడియో షేర్‌ చేసిన వైష్ణవి | Vyshnavee Gade New House Warming | Sakshi
Sakshi News home page

Vyshnavee Gade: కొత్తింట్లో అడుగుపెట్టిన సీరియల్‌ నటి.. రైస్‌కుక్కర్‌లో పాలు పొంగిస్తూ..

Published Sun, Nov 12 2023 12:11 PM | Last Updated on Sun, Nov 12 2023 12:55 PM

Vyshnavee Gade New House Warming - Sakshi

బుల్లితెర నటి వైష్ణవి తాజాగా గృహప్రవేశం చేసింది. ఇరుకు గదులతో ఇబ్బందిపడుతున్న ఆమె తాజాగా కొత్తింటికి షిఫ్ట్‌ అయింది. ఈ దీపావళిని కొత్తింట్లోనే సెలబ్రేట్‌ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కుడికాలు పెట్టి కొత్తింట్లో అడుగుపెట్టిన నటి ముందుగా పూజగదిలో దేవుళ్లను శుభ్రం చేసి కుంకుమ పెట్టి పూజ చేసింది. తర్వాత ఇంటిని బంతిపూలతో అందంగా అలంకరించింది. అయితే ఇంట్లో కొన్ని పనులు ఇంకా జరుగుతున్నందున పూర్తి సామాగ్రిని తెచ్చుకోలేదంది. అందుకని రైస్‌ కుక్కర్‌లోనే పాలు పొంగించేసింది.

సొంతింటి కల సాకారానికి ఇంకాస్త సమయం పడుతుందని, ప్రస్తుతానికైతే ఇది అద్దె ఇల్లు అని పేర్కొంది. పాత ఇల్లు ఉండటానికి ఇరుకుగా మారటంతో 3.5 బీహెచ్‌కేలో అద్దెకు దిగామని చెప్పింది. ఈ ఇల్లు విశాలంగా ఉందని, గాలి,వెలుతురు చాలా బాగా వస్తున్నాయని సంతోషపడిపోయింది. ప్రతి గదిలో కప్‌బోర్డులు ఉన్నాయంది. ఇంకా కొన్ని గదులు మేకోవర్‌ చేయాలంది. ఇది చూసిన జనాలు.. త్వరలోనే సొంతింటి కల కూడా నెరవేరుతుందని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ముగ్గులేసిన సితార, ఉపాసన ఇంట దీపావళి పార్టీ.. దీపాల కాంతుల్లో వితికా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement