మరో ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ 'విశ్వం' | Viswam Movie OTT Platform And Streaming Details | Sakshi
Sakshi News home page

Viswam OTT: రెండు ఓటీటీల్లో 'విశ్వం' స్ట్రీమింగ్

Nov 3 2024 8:36 AM | Updated on Nov 3 2024 9:59 AM

Viswam Movie OTT Platform And Streaming Details

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో గోపీచంద్ ఒకడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'విశ్వం'. అప్పట్లో కామెడీ చిత్రాలతో తనదైన ట్రెండ్ చేసిన శ్రీనువైట్ల.. దాదాపు ఆరేళ్ల తర్వాత చేసిన సినిమా ఇది. థియేటర్లలో రిలీజైన ఇరవై రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అయిపోతోంది.

(ఇదీ చదవండి: సూర్య 'కంగువ'.. తెలుగులోనే ముందు!)

గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో వచ్చిన ఈ సినిమాని ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీశారు. చెప్పడం అయితే కామెడీ అన్నారు గానీ రొటీన్ రొట్టకొట్టుడు స్టోరీ అయ్యేసరికి జనాలు రిజెక్ట్ చేశారు. దీపావళి సందర్భంగా తొలుత ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోకి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

'లౌక్యం' సినిమా వచ్చి పదేళ్లు దాటిపోయింది. ఈ సినిమాతో హిట్ కొట్టిన గోపీచంద్.. ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్నాడు. కాకపోతే అవి వచ్చి వెళ్తున్నాయి తప్పితే ఒక్కటి గుర్తుంచుకోదగ్గ స్థాయిలో లేదు. మరోవైపు శ్రీనువైట్ల కూడా ఎంతో నమ్మకంతో ఈ సినిమా తీశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం వీళ్లిద్దరి చేతిలోనూ మరో ప్రాజెక్ట్ లేదు. 

(ఇదీ చదవండి: OTT Review: ఊహకందని థ్రిల్లింగ్‌ వెకేషన్‌)

Advertisement
 
Advertisement
Advertisement