
చిరంజీవి హీరోగా చేస్తున్న ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. ఈ పాటికే థియేటర్లలో రిలీజ్ అయిపోవాలి. కానీ గతేడాది రిలీజ్ చేసిన టీజర్‌కి దారుణమైన రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్ ఏంటి ఇలా ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి. దీంతో పునరాలోచనలో పడిపోయిన టీమ్.. ప్రస్తుతానికి దానిపై మరింతగా వర్క్ చేస్తోంది. ఈ ఏడాది అక్టోబరులో మూవీ రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ చిత్ర దర్శకుడు వశిష్ట మీడియా ముందుకొచ్చారు. చిత్ర కథని రివీల్ చేయడంతో పాటు బోలెడన్ని విశేషాలు బయటపెట్టారు.
'మనకు మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటిని ఎవరికీ తోచిన విధంగా వాళ్లు చూపించారు. యమలోకం, స్వర్గం, పాతాళలోకం.. అన్నీ చూసేశాం. 'విశ్వంభర' కోసం వీటన్నింటిని దాటి నేను పైకి వెళ్లాను. బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని ఇందులో చూపించాం. ఈ 14 లోకాలకు అదే మెయిన్. హీరో నేరుగా ఆ లోకానికి వెళ్తాడు. హీరోయిన్‌ని ఎలా తిరిగి తనతో పాటు తెచ్చుకుంటాడనేదే స్టోరీ' అని వశిష్ట చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: 'కొత్తపల్లిలో ఒకప్పుడు' సినిమా రివ్యూ)
టీజర్ పై వచ్చిన వ్యతిరేకత గురించి కూడా మాట్లాడిన డైరెక్టర్.. 'వచ్చిన నెగిటివిటీ అంతా టార్గెటెడ్ అనిపిస్తోంది. ఎందుకు చేశారో కూడా తెలియదు. యూట్యూబ్, టీవీల్లో చూసిన వాళ్లకు ఒకలా అనిపించింది. థియేటర్‌లో చూసినప్పుడు మరోలా అనిపించింది. అలానే రెండున్నర గంటల సినిమాలో రెండు గంటల పాటు గ్రాఫిక్స్ ఉంటుంది. సెకండాఫ్ మొత్తం అదే. అంటే దాదాపు 70 శాతం వీఎఫ్ఎక్స్ ఉంటుంది' అని వశిష్ట చెప్పారు.
'జగదేకవీరుడు అతిలోక సుందరి', 'అంజి' తర్వాత చిరు ఫాంటసీ జానర్‌లో సినిమాలు చేయలేదని.. అందుకే తాను ఇలాంటి స్టోరీని ఎంచుకున్నానని కూడా వశిష్ట చెప్పుకొచ్చాడు. చిరు సరసన ఈ చిత్రం త్రిష హీరోయిన్‌గా చేసింది. ఈమెతో పాటు ఆషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా తదితరులు కూడా నటించినట్లు తెలుస్తోంది. ఓ స్పెషల్ సాంగ్, రెండు రోజుల ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉందని, జూలై 25 నుంచి మొదలయ్యే షూటింగ్‌తో ఇది కంప్లీట్ చేస్తామని తద్వారా సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని వశిష్ట క్లారిటీ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: Junior Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ)